మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా | నీతి టీవీ న్యూస్
మేడ్చల్–మల్కాజ్‌గిరి అర్బన్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో “వికసిత్ భారత్ సేవా సంకల్ప – జ్యోతి యాత్ర” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శోభ గార్డెన్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ, దేశ అభివృద్ధిని లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 25 సంవత్సరాల ప్రజా సేవకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. వికసిత్ భారత్–2047 నిర్మాణానికి దేశ ప్రజలను ఏకం చేయడమే లక్ష్యంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ చింతల వెంకట్ రెడ్డి గారు హాజరయ్యారు.
అలాగే మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ గిరి వర్ధన్ రెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ శ్రీమతి రాజ్యలక్ష్మి గారు, మాజీ కార్పొరేటర్ శ్రావణ్ గారు, సీనియర్ నాయకులు సంతోష్ గారు తదితరులు పాల్గొన్నారు.
జ్యోతి యాత్రలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనకు ప్రజల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. దేశ ప్రగతి, ప్రజా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
– నీతి టీవీ న్యూస్
