నెల్లూరు తేదీ 14 నవంబర్ 2026
స్వచ్ఛ పురస్కారం అందుకున్న డాక్టర్ కిరణ్, వైద్యులు, సిబ్బందికి మంత్రి ప్రశంసలు....
ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు స్వచ్ఛ ఆంధ్ర పురస్కారం లభించడం పట్ల రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు.
ఇటీవల ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా స్వచ్ఛ ఆంధ్ర పురస్కారాన్ని అందుకున్న ఆత్మకూరు జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ గారితో పాటు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, ఆసుపత్రి సిబ్బందిని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందించారు.
ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రత, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం, పారిశుద్ధ్య నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ కనబరచడం ద్వారా ఈ పురస్కారాన్ని సాధించడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు.
ఇదే స్ఫూర్తితో ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలను మరింత అభివృద్ధి చేసి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని మంత్రి ఆనం ఆకాంక్షించారు.
