ఇంటింటి తిరిగి మల్లన్న సాగర్ లో బాధితుల దగ్గరకి వెళ్లి సమస్యలు తెలుసుకున్న నీరుడి స్వామితెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షుడు నీరుడి స్వామి
గజ్వేల్ సెప్టెంబర్ 4:
ఈరోజు గజ్వేల్ లో ఇంటింటా తిరిగి సమస్యలు తెలుసుకున్న తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షుడు నీరుడి స్వామి యువజన విభాగం అధ్యక్షుడు కీసర స్వామి గార్లు మాట్లాడుతూ ముంపు గ్రామాల ఆర్ అండ్ ఆర్ కాలనీలో మల్లన్న సాగర్ బాధితులకు న్యాయం జరగాలని వేముల గట్టు పల్లెపాడు కిష్టాపూర్ ఎర్రవెల్లి ఆర్ఎండర్ ముంపు గ్రామాల ప్రజలతోని స్వయంగా మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు.
కెసిఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు రెండు సంవత్సరాల గా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ముంపు గ్రామాలకు న్యాయం చేయలేకపోయారు. ఇప్పటికైనా ప్రజల నుండి వచ్చిన కొన్ని న్యాయమైనటువంటి డిమాండ్స్ ని కాంగ్రెస్ ప్రభుత్వం బాధితుల పట్ల ఆలోచన చేసి బాధితులకు న్యాయం చేయాలని వారు అన్నారు. అదే విధంగా వారికి నష్టపోయిన వారికి జీవన ఉపాధి కోసం బ్రతుకు దెరువు కోసం ప్రతి రోజు అడ్డమీద కూలీలుగా పోతున్నాం అని దొరకని రోజు పొట్టగడవడానికి కూడా ఇబ్బంది ఉంది అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేసారు అని తెలియ చేశారు.
కాబట్టి ప్రభుత్వం వారికి జీవన ఉపాధి కోసం ప్రత్యామ్నాయంగా వారికి ఉపాధి కల్పించే విధంగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని వారికి బ్రతికి దెరువు కోసం ఆలోచన చెయ్యాలి అని అన్నారు గత ప్రభుత్వం మల్లన్న సాగర్ రైతులను విస్మరించింది వారికి న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అని అన్నారు మరియు గత ప్రభుత్వం రైతుల మీద పెట్టిన కేసులను ఎత్తివేయాలి అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బాధితులతోని మాట్లాడి వారితో చర్చలు జరిపి వారికి న్యాయం చెయ్యాలి డిమాండ్ చేశారు
అదే విధంగా మల్లన్న సాగర్ బాధితుల మీద కన్నీళ్ల సాగరం గూడు చెదిరిన దృశ్యం లాంటి పుస్తకాల్లో వారీ కన్నీటి గాథలు వినిపిస్తున్నాయి బాధితులకు న్యా యం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అని అన్నారు అంతే కాకుండా కొంత మంది రైతులకు ఇప్పటికి కూడా ఇంకా రాని వారు ఉన్నారు అని ఒక సారి ప్రభుత్వము కూడా సమగ్ర విచారణ జరిపి వారికి న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మాపురం కనకయ్య, నాన్నం గిరి ముంపు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

